Wednesday, October 23

08 & 09 OCT CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

8,9 అక్టోబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (TS & AP)

ఇవాళ్టి నుంచి డైల్వీ క్విజ్ స్టార్ట్ చేస్తున్నాం.  వివిధ సబ్జెక్టులకు సంబంధించి మీకు డైలీ క్విజ్ లు ఇస్తాం.  మీరు వెబ్ సైట్ లో ఓపెన్ చేసి రాసుకోవచ్చు.

1. నోటి ఆరోగ్యంపై జనంలో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్ సైట్, మొబైల్ యాప్ లను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఆవిష్కరించారు.  ఆ యాప్ పేరేంటి ?

2. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్థాన్ విఫలమైందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ( FATF) తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ కార్యక్రమాలపై ఐక్యరాజ్యసమితికి నివేదికలను ఈ సంస్థ అందిస్తుంది.  గత ఏడాది పాకిస్థాన్ ను ఏ లిస్ట్ లో పెట్టింది ?

3. పండగ సమయాల్లో తమ కస్టమర్లకి డెబిట్ కార్డు ద్వారా  EMI సదుపాయాన్ని కల్పించిన ప్రభుత్వ రంగం బ్యాంకు ఏది ?

4. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది.  అయితే అమరావతిలో ఏపీ హైకోర్టు ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది ?

5. 2019 వైద్య రంగంలో నోబెల్ బహుమతులపై ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) ప్రాణవాయువుపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కీలిన్ జూనియర్ (హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ( హాప్కిన్స్ యూనివర్సిటీ ), బ్రిటన్ కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్ క్లిఫ్ (ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్) కు ఈ అవార్డు దక్కాయి.

2) శరీరంలోని కళాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయి, ఆ స్థాయిలకు అనుగుణంగా ఎలా మార్చుకుంటాయో వివరించారు

3) ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనలు రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో పరిశోధనలు ఉపయోగపడ్డాయని నోబెల్ కమిటీ పేర్కొంది.

4) ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రైజ్ మనీ కింద 9.18 లక్షల అమెరికన్ డాలర్లు ( రూ.6.51 కోట్లు ) ఇస్తారు

6. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం రెండు ప్రత్యేక విమానాలు సిద్ధమవుతున్నాయి.  బోయింగ్ 777 తరగతికి చందిన ఈ అత్యాధునిక విమానాలు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలోనే ఉంటాయి.  అమెరికాలోని డాలస్ లో ఉన్న బోయింగ్ కేంద్రంలో వీటిని తయారు చేస్తున్నారు.  ప్రాజెక్ట్ వ్యయం రూ.1346 కోట్లు.  ఇవి ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తాయి ?

7. భారతీయ పౌరులు తమ దేశ బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాలకు సంబంధించిన జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్ కు అందించింది.  2020 సెప్టెంబర్ లో రెండో జాబితాను ఇవ్వనుంది.  స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ జాబితాను అందించింది.  అయితే మొత్తం ఎన్ని దేశాలతో స్విట్జర్లాండ్ కు ఈ అగ్రిమెంట్ కుదరింది ?

8. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (TSIIC) ఛైర్మన్ గా గ్యాదరి బాలమల్లు పదవీ కాలాన్ని ఎన్నేళ్ళు పొడిగిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ( 2016లో ఛైర్మన్ గా నియమితులైన బాలమల్లు పదవీ కాలం 2019 అక్టోబర్ 10న ముగియనుంది )

9. మై మదర్... మీ మై వైఫ్ : ఏ కాగ్నిజోగ్రఫీ ఇన్ రామ్ బ్లింగ్ రియలిజం – అనే పుస్తకాన్ని ఢిల్లీలోని JNU లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ స్టడీ – IIAS( సిమ్లా) ఛైర్మన్ ప్రొ. కపిల్ కపూర్ ఆవిష్కరించారు.  ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు ?

10. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మొత్తం దేశంలోని 117 ఆశవాహ జిల్లాలకు ఆరోగ్యం, పోషకాహారం అందించడంలో ఇచ్చిన ర్యాంకుల్లో తెలంగాణకి చెందిన ఏ జిల్లాకి 3 ర్యాంక్ దక్కింది ?