Sunday, February 23

07 SEPT CURRENT AFFAIRS

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

07 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ) కోడ్ ఆధారంగా క్యాష్ విత్ డ్రాకి వీలు కల్పించే ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) లను ముంబై, చెన్నై, ఢిల్లీల్లో 2019 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన బ్యాంక్ ఏది

2. వాతావరణ మార్పులతో 2050 నాటికి (మరో 30యేళ్ళల్లో ) భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లో ఏ పండుకు చెందిన పంట అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్ లోని ఎక్స్ టర్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు

3. అణుశక్తి ఆధారంగా నడిచే దేశీయ రెండో జలాంతర్గామి ఏది

4. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఫైటర్ జెట్లు, వార్ షిప్పులు, మిస్సైళ్లకు సంబంధించి ఈ కింది ఇచ్చిన జతలలో సరైన వివరణ దేనికి ఇచ్చారు

ఎ) కమోవ్ -226T హెలికాప్టర్స్ – ఆర్మీ కోసం 200 యూనిట్ల హెలికాప్టర్స్ కొంటున్నారు.ఇందులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ భాగస్వామి

బి) కలష్నికోవ్ AK 203 – 7.5 లక్షల రష్యన్ అస్సాల్డ్ రైఫిల్స్ ను ఇండియన్ ఆర్మీకి సరఫరా చేస్తారు. అమేథీ నియోజకవర్గంలతోని కోర్వా దగ్గర జాయింట్ వెంచర్ ప్రారంభమైంది.  ఇక్కడే తయారు చేస్తారు

సి) ప్రాజెక్ట్ 75 –I సబ్ మెరైన్లు – ఆరు కొత్త సబ్ మెరైన్లు తయారీకి ఏడు బిలియన్ డాలర్లు (రూ.50వేల కోట్లతో) రోసోబోరోన్ ఎక్స్ పర్ట్ సంస్థ తయారు చేస్తోంది. వచ్చే 30 యేళ్ళల్లో 12 సబ్ మెరైన్స్ తయారు చేస్తారు

డి) ఇగ్లా –ఎస్ : నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకోసం 5,175 మిస్సైళ్ళు, 800 లాంఛర్లను రోసోబోరోన్ ఎక్స్ పర్ట్ సంస్థతో 1.5 బిలియన్ డాలర్ల విలువతో తయారు చేయనుంది

5. శాస్త్రీయంగా నిర్దారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నఇంటర్నెట్ దిగ్గజం ఏది ?

( స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీ లాంటి శాస్త్రీయంగా పూర్తి నిర్ధారణ కాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్స్ ఇక ప్రచురించదు )

6. జాతీయ రహదారుల పరిశుభ్రత విభాగంలో ఇచ్చే స్వచ్ఛ మహోత్సవ్ – 2019 పురస్కారాన్ని జీమ్మార్ కి చెందిన ఏ సంస్థకు దక్కింది ? (కొర్లపహాడ్ టోల్ ప్లాజాకి ఈ అవార్డు దక్కింది )

7. సాంకేతిక లోపంతో చంద్రయాన్ 2 అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.  దీనికి సంబంధించిన ప్రకటనల్లో సరైనవాటిని గుర్తించండి

ఎ) చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి

బి) విక్రమ్ సారాభాయ్ పేరున విక్రమ్ బరువు 1471 కిలోలు.  27 కిలోల బరువున్న ప్రజ్ఞాన్ సౌరశక్తి సాయంతో 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది

సి) విక్రమ్, ప్రజ్ఞాన్ రెండింటికీ 14 రోజుల పాటు ప్రయాణించే సామర్థ్యం ఉంది

8. జింబాబ్వే అధ్యక్షుడిగా (జింబాబ్వే పితామహుడు) కొనసాగి ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే 95 యేళ్ళ వయసులో చనిపోయారు.  ఆయన ఎన్నేళ్ళపాటు అధ్యక్షుడిగా కొనసాగారు ?

9. భారత సైన్యం ఉపయోగించే ధనుష్ కు సంబధించి ఈ కింది వాటిల్లో ఏది సరైనది

10. దేశీవాళీ ఆవుల పెంపకం, సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద తెలంగాణకు రూ.5.37 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులనతో పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో దేశీవాళీ జాతులకు చెందిన 500 ఆవులు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు