Sunday, February 23

06 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

06 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

Read also : తెలంగాణ ఎగ్జామ్స్ టాప్ 30 యూట్యూబ్ క్లాసెస్

1. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఎన్ని కోట్లకి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు

2. సింధు పూర్వీకులు ఇరాన్ రైతులు అనడానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి తప్పు

ఎ) హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు

బి) దక్షిణాసియా ప్రాంత ప్రజల్లో అత్యధికులు ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన రైతులని చెబుతున్నారు

సి) సింధు కాలానికి చెందిన రాఖీగఢ్ ( ప్రస్తుత హరియాణా రాష్ట్రం) నుంచి దాదాపు 60 అస్తి పంజరాల నమూనాలపై జన్యు పరిశోధనలను CCMB శాస్త్రవేత్తలు చేశారు

డి) ఈపరిశోధనలకు CCMB శాస్త్రవేత్త కె.తంగరాజ్ నాయకత్వం వహించారు

ఇ) ఇరాన్ ప్రాంత రైతులు 5వేల యేళ్ళ క్రితం మొదట యూరప్ వైపు వెళ్లారు. తర్వాత 1500 సంవత్సరాల క్రితం తిరిగి సింధు నాగరికత ప్రాంతానికి వచ్చారు

3. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు అందుకున్న ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు ఎవరు ?

4. ఈ కింది వాటిల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఎమినెన్స్ (IOE) హోదా దక్కించుకున్న విద్యా సంస్థల్లో సరికానిది ఏది.

1) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

2) మద్రాస్ IIT

3) IISC, చెన్నై

4) ఖరగ్ పూర్ IIT

5) బనారస్ హిందూ యూనివర్సిటీ

6) ఢిల్లీ యూనివర్సిటీ

5. హైదరాబాద్ లేజర్ టెక్నాలజీపై ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో బ్రిటన్ కు చెందిన 2 వేర్వేరు బృందాలు లేజర్ టెక్నాలజీపై పరిశోధనలు చేయాలని నిర్ణయించాయి

2) హైదరాబాద్ TIFR ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసే ఫోటానిక్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎపిక్) కు కేంద్రం రూ.896 కోట్లు కేటాయించింది

3) బ్రిటన్ భాగస్వామ్యంతో జరిగే ఈ పరిశోధనలకు యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (యుక్రీ) మరో రూ.25 కోట్లు ఖర్చు చేస్తుంది

4) 150 టెరావాట్ల సామర్థ్యమున్న లేజర్ కిరణాలను సృష్టించి పరిశోధనలు చేయాలని నిర్ణయించారు

6. రష్యాలోని తూర్పు రాష్ట్రాల కు భారత్ ఎన్నివేల కోట్ల రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది ?

7. చంద్రయాన్ 2 కి సంబంధించి ఈ కింది వాటిల్లో సరి కానిది గుర్తించండి

ఎ) GSLV MARK-3 రాకెట్ ద్వారా 2019 జులై 22న శ్రీహరి కోట నుంచి చంద్రయాన్ శాటిలైట్ ను ఇస్రో ప్రయోగించింది

బి) 48 రోజులకు ల్యాండర్ జాబిల్లి దక్షణ ధృవ ప్రాంతంపై 2019 సెప్టెంబర్ 7న ల్యాండ్ అవుతోంది

సి) చందమామపై దిగుతున్న ల్యాండర్ పేరు ఆకాశ్

8. బహమాస్ లో విధ్వంసం సృష్టించిన డోరియన్ హరికేన్ ఇప్పుడు ఏ దేశం తీరం వైపు దూసుకొస్తోంది

9. 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ (EEF) ప్లీనరీలో ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యధక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే పాల్గొన్నారు.  ఈ ప్లీనరీ ఎక్కడ జరుగుతోంది ?

10. ఏపీ గుంటూరులోని రామచంద్రాపురంలో 73యేళ్ళ వయస్సుల్లో IVF ద్వారా ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చిన వృద్ధురాలు ఎవరు ?