Thursday, October 1

06 FEB 2020 CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి

http://telanganaexams.com/06-feb-2020-current-affairs-quiz-ts-ap/

1. అయోధ్య చట్టం కింద ఎన్ని ఎకరాల భూమిని ట్రస్టుకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

2. ) దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేటు రైళ్ళు నడపాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  ఇందులో వచ్చే ఏడాదిన్నరలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎన్ని తేజస్ రైళ్ళు నడిపించే అవకాశముందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్య తెలిపారు ?

3. భారత్ వంటకాలకు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు ప్రఖ్యాత చెఫ్ గరిమా అరోరా స్థాపించిన సంస్థ పేరేంటి ?

4. విద్రోహశక్తులు అమర్చిన విస్ఫోటక పదార్థాలను ముందుగా గుర్తించడమే కాకుండా... వాటి శక్తి సామర్థ్యాలను అంచనా వేసే ఆధునిక ఫెమ్టొ సెకండ్ లేజర్ సాంకేతికను ఆవిష్కరించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ యువ శాస్త్రవేత్త ఎవరు ?

5. 2020 ఫిబ్రవరి1 న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020-21 కేంద్ర బడ్జెట్ లో భారతీయ రైల్వేల కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు ?

6. పక్షవాతం లేదా ఇతర నాడీ సంబంధ వ్యాధులకు కారణమయ్యే ఎమయోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధి నివారణకు కండరాల కదలికల్లో మార్పును తెచ్చే AIM4అనే అణువును కనుగొన్న పరిశోధకలు ఏ IIT కి చెందినవారు ?

7. భారీ కంటైనర్ నౌకల రాకపోకలకు వీలుగా రూ.65,544 కోట్లతో భారీ ఓడరేవును మహారాష్ట్రలో ఎక్కడ నిర్మించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ?

8. ఏ ఆయుర్వేద మొక్కపై మొదటిసారిగా సంస్కృతంలో బాబా రాందేవ్ కంపెనీ పతంజలి చేసిన పరిశోధనను  స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటర్నేషనల్ సైన్స్ జర్నల్ MDPI అందుబాటులోకి తీసుకొచ్చింది ?

9. అద్దె గర్భాలు (సరోగసీ) బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 15 సిఫార్సులు చేసింది.  23 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తన నివేదికను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి సమర్పించింది.  ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు ?

10. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్ గా ఎవరిని నియమించింది ?

11. అయోధ్యలో రామాలయం స్థలానికి బదులుగా సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.  అది ఏ ప్రదేశంలో కేటాయించింది ?

12. రక్షణ రంగంలో రూ.35వేల కోట్ల ఎగుమతులే లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.  ఉత్తరప్రదేశ్ లోని ఎక్కడ జరుగుతున్న 11వ రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు ?

13. కేంద్ర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకి ఎన్ని కోట్లను కేటాయించారు ?


 

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.