Friday, February 28

05 OCT CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

1. సెమీ కండక్టర్ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ఇంక్ హైదరాబాద్ లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది.  ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.  ఈ సంస్థ ఏ దేశానికి చెందినది ?

2. ప్రపంచ ఆకర్షణీయ నగరాలు ( స్మార్ట్ సిటీ)లకు సంబంధించి ఈ కింది ప్రకటనలను చదివి సరైనవి గుర్తించండి

1) స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ (IIMD), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్ మెంట్ (SUTD) సంయుకర్తంగా ఈ జాబితాను ప్రకటించాయి

2) భారత్ లోని 3 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మొదటి ప్లేస్ లో నిలిచింది.  ఆ తర్వాత ఢిల్లీ, ముంబై నిలిచాయి

3) ప్రపంచంలోని మొత్తం 102 స్మార్ట్ సిటీలకు ర్యాంకుల ఇచ్చాయి.  వీటిల్లో హైదరాబాద్ కి 67వ స్థానం, ఢిల్లీకి 68, ముంబైకి 78 స్థానాలు దక్కాయి

4) ప్రపంచంలో సింగపూర్ మొదటిస్థానంలో, జూరిచ్ ( స్విట్జర్లాండ్), రెండో స్థానంలో, ఓస్లో ( నార్వే) మూడో స్థానంలో నిలిచాయి

3. ఆంధ్రప్రదేశ్ లోని 1,73,102 మంది ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాల ఏలూరులో ప్రారంభించారు.  ఈ పథకం కింద ఏడాదికి ఎన్నివేలు చొప్పున ఇవ్వనున్నారు ?

4. చిన్నారుల్లో కంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తించి హెచ్చరించే సరికొత్త మొబైల్ యాప్ ను అమెరికాకి చెందిన ఏ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు ?

5. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం పథకానికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది.  అటవీ సంబంధిత సవాళ్ళు, సైన్స్ ఆధారిత పరిష్కారాల్ని ప్రోత్సహించేందుకు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్గనైజేషన్స్ ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ 25వ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?

6. కిలో ప్లాస్టిక్ కు బదులు కిలో సన్నబియ్యం ఇవ్వాలని తెలంగాణకి చెందిన ఏ జిల్లాలో నిర్ణయించారు ?

7. తెలంగాణలో రక్తం, అత్యవసర మందులను డ్రోన్ల ద్వారా సప్లయ్ చేసేందుకు 2020 నుంచి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఏ హాస్పిటల్ గ్రూప్ నకు తెలంగాణ ప్రభుత్వం EOI ఇచ్చింది.

8. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ను ఉత్తరప్రదేశ్  రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.  ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఏయే స్టేషన్ల మధ్య నడవనుంది ?

9. ఏపీలో పాఠశాల విద్యాశాఖ సలహాదారుగా నియమితులైన రిటైర్డ్ IAS ఆఫీసర్ ఎవరు

10. ) పరిసరాల పరిశుభ్రదతపై ప్రజంలో అవగాహన పెంచడంతో పాటు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి అవార్డును ఏ ప్రముఖ క్రికెటర్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో అందించారు ?