Monday, September 23

04 SEPT CA QUIZ

ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... ఈ లింక్ ద్వారా మీరు వెబ్ సైట్ లో ఓపెన్ చేసి రాసుకోగలరు

04 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ISSF షూటింగ్ ప్రపంచకప్ లో మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సౌరభ్ చౌదరి జంట స్వర్ణం సాధించింది.  ఈ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?

2. ప్రతిష్టాత్మక బుకర్ పురస్కారం 2019 కోసం ఎంపిక చేసిన నవలల జాబితాలో సల్మాన్ రష్దీ రచించిన ఏ నవలకు చోటు దక్కింది. (గతంలో ఆయన రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ కు బుకర్ ప్రైజ్ వచ్చింది )

3. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 యేళ్ళు అవుతున్న సందర్భంగా ఏ రంగాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది ?

4. ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం గురించి ఈ ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం నాలుగో సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరగనుంది

2) ఈ సంఘానికి అధ్యక్షుడిగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా నియమితులయ్యారు

3) సమాఖ్య మాజీ అధ్యక్షుడు అయాన్ మింకురాడులెస్కు (రొమేనియా) నుంచి అరోరా బాధ్యతలు స్వీకరించారు

4) 2021 వరకూ అరోరా పదవిలో కొనసాగుతారు

5. దేశంలోని ఏ బ్యాంకుకు రూ.9,300 కోట్ల మూలధన సాయం అందించేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది

6. ఈ కింది ప్రకటనలను చదివి సరైనవి గుర్తించండి

  1. హైదరాబాద్ ఓపెన్ BWF సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ఆటగాడు సౌరభ్ వర్మ ఛాంపియన్ గా నిలిచాడు
  2. మహిళల డబుల్స్ లో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ రన్నరప్ గా నిలిచింది
  3. మహిళల సింగిల్స్ లో జియాో మిన్ (సింగపూర్ ) విజేతగా నిలిచింది
  4. పురుషుల డబుల్స్ లో షోహిబుల్ - మౌలానా (ఇండోనేషియా), మిక్స్ డ్ డబుల్స్ లో పాంగ్ రాన్ - యూసీ (మలేసియా) విజయం సాధించారు

7. లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారంగ్ ఏపీలోని ఎక్కడ షూటింగ్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. గతంలో హైదరాబాద్ లో ఆయన అకాడమీ ఏర్పాటు చేశారు.

8. తెలంగాణలో 30 రోజుల ప్రణాళికకు సంబంధించి గ్రామాల బాట ఎప్పటి నుంచి మొదలవుతోంది

9. ప్రధాని నరేంద్రమోడీకి 2019 సెప్టెంబర్ 24న గ్లోబల్ గోల్ కీపర్ పురస్కారం – 2019ను న్యూయార్క్ లో జరిగే కార్యక్రమంలో అందించనున్న సంస్థ ఏది

10. కావేరీ సంరక్షణ ఉద్యమానికి సంబంధించిన ఈ ప్రకటనల్లో ఏవి సరైనవి

1) కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహించే కావేరీ నది సంరక్షణకు ఈశా ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది

2) కావేరి పిలుస్తోంది పేరుతో ఫౌండేషన్ స్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ ఉద్యమాన్ని ప్రారంభించారు

3) కర్ణాటకలోని కావేరీ జన్మస్థలం తలకావేరీలో పూజలు నిర్వహించి ర్యాలీ నిర్వహించారు