Wednesday, October 23

04 OCT CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ Telangana exams యాప్ లో ఓపెన్ అవదు... అందువల్ల మీరు  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

04 అక్టోబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( TS & AP)

1. గురుకులాల్లో పేద విద్యార్థులకు విద్యా ప్రణాళిక, 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా అమలు చేస్తున్నారు అన్న అంశాలంపై తెలంగాణలోని గురుకులాల వ్యవస్థపై అధ్యయనం చేయనున్న ప్రముఖ విశ్వవిద్యాలయం ఏది ?

2. జాతీయ పోషకాహార సంస్థ (NIN) మాజీ డైరెక్టర్ చెన్నైలో చనిపోయారు.  వైద్యం, పోషకాహార రంగాల్లో అనేక పరిశోధనలు చేసిన ఆయన పేరేంటి ?

3. దేశంలో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా రూ.6000 కోట్లతో ఏ పేరుతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది ?

4. పోషకాహార లోపానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న డేటాలో ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది ?

1) దేశవ్యాప్తంగా బరువు తక్కువగా ఉన్న చిన్నారులు అత్యధికంగా జార్ఘండ్ లోని సంఘమ్ ‘61శాతం) పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నారు. అత్యల్పంగా జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ (11శాతం) లో ఉన్నారు

2) తక్కువ బరువుతో పుట్టే చిన్నారులు అత్యధికంగా మధ్యప్రదేశ్ లోని మాండ్ సౌర్ ( 35శాతం) ఉండగా, అత్యల్పంగా మిజోరాం రాష్ట్రంలోని మిజోరాం (4శాతం) లో ఉన్నారు

3) రక్తహీనత అత్యధికంగా ఉన్న చిన్నారులు ఎక్కువగా దాద్రా నగర్ హవేలీ నియోజకవరగ్లో 84శాతం మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు

5. ఏపీలోని విజయవాడ దగ్గర్లో కృష్ణా నదిపై జాతీయ రహదారు ప్రాధికార సంస్థ (NHA)  ఆధ్వర్యంలో ఎన్ని కోట్లతో ఆరు వరుసల రహదారి వంతెనను నిర్మించాలని నిర్ణయించారు ?

6. ఆంధ్రప్రదేశ్ మొదటి పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?

7. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, పిల్లల్లో పౌష్టిక లోపాల సమస్యలను నివారించేందుకు ఏ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది ?

8. ఢిల్లీ – కత్రా (జమ్ముకశ్మీర్ ) మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019 అక్టోబర్ 4 నాడు ప్రారంభించారు.  దీని పేరేంటి ?

9. పోషకాహార లోపానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎస్వీ సుబ్రమణియన్, విలియం జో, రాఖిలి కిమ్ లు టాటా ట్రస్ట్ సహకారంతో దేశంలో సర్వే నిర్వహించారు

బి) దేశంలోని 543 పార్లమెంటు నియోజవర్గాల్లో ఈ అధ్యయనం సాగింది

సి) దేశంలో బాలల్లో ఎదుగుదల లోపం తక్కువగా ఉన్న 20 ఎంపీ సీట్లల్లో సగానికి పైగా కేరళలోనే ఉన్నాయి

డి) పిల్లల్లో అత్యధిక ఎదుగుదల లోపం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని బహరించ్ (64శాతం), అత్యల్ప లోపం ఉన్నది కొల్లం (15శాతం )

10. NCERT కి చెందిన 8,9 పాఠ్య పుస్తకాలను క్విక్ రెస్పాన్స్ కోడ్ (QR CODE) స్కాన్ చేయడం ద్వారా వివరంగా వీడియోలు, చిత్రాల ద్వారా చదువుకునే అవకాశం కల్పించారు.  అయితే ఏ యాప్ లో ఈ పాఠ్యాంశాలను అప్ లోడ్ చేశారు ?

11. పోషకాహారా లోపానికి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

ఎ) తెలంగాణలో ఎదుగుదల లోపం అత్యధికంగా ఉన్న పార్లమెంట్ స్థానం ఆదిలాబాద్ (34.8శాతం)

బి) తెలంగాణలో బరువు తక్కువతో పుడుతున్న వారిలో ఎక్కువ మంది మెదక్, జహీరాబాద్ లో ఉన్నారు

సి) పోషకాహార లోపం అత్యల్పంగా ఉన్న పార్లమెంట్ స్థానం సికింద్రాబాద్ (19.3శాతం)