Sunday, February 23

04 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

04 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంద్రప్రదేశ్)

1. భద్రత ప్రాముఖ్యతపై జనానికి అవగాహన కల్పించేందుకు విజయవాడ సిటీ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన యాప్ ఏది ?

2. భారత్ – అమెరికా రక్షణ సంబంధాల సదస్సును 2019 డిసెంబర్ 18, 19 తేదీల్లో ఎక్కడ నిర్వహించనున్నారు ?

(నోట్: రెండు దేశాల రక్షణ అధికారులు, పరిశోధకులు, రక్షణ వ్యాపార దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొంటాయి )

3. ఏదైనా బ్యాంకు దివాలా తీసినప్పుడు డిపాజిటర్లకు లభించే బీమా మొత్తం ఎంతగా ఉంది ?

(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ చట్టం 1961, సెక్షన్ 16(1) ప్రకారం ఈ మొత్తాన్ని నిర్ణయించారు)

4. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధృవీకరణ విధానం ( TS IPASS) కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

ఎ) 2014 డిసెంబర్ 4న ఈ టీఎస్ ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చింది

బి) 2015 జూన్ 12 న ఆన్ లైన్ అనుమతుల ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు

సి) ఆన్ లైన్ లో నమోదు అనుమతుల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు

డి) టీఎస్ – ఐపాస్ ఏర్పాటైన 5యేళ్ళల్లో రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి

5. TS IPASS అమలులో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లాలు ఏవి ?

6. పౌష్టికాహార లోప రహితంగా దేశాన్ని 2022 కల్లా తీర్చిదిద్దాలన్న సందేశంతో రూపొందించిన భారతీయ పోషణ గీతాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.  ఈ గీతాన్ని రాసిన ప్రముఖ రచయిత ఎవరు ?

7. జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (NCRP) రికార్డుల ప్రకారం క్యాన్సర్ మృతుల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏయే స్థానాల్లో ఉన్నాయి.

8. రుణాల జారీలో వృద్ధితో పాటు NPA లకు కేటాయింపుల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులు ఎంత మూలధనం అవసరమని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది ?

9. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా పంపిన విక్రమ్ కూలిపోయిన సంగతి తెలిసింది. అయితే దాని శకలాలను నాసా చిత్రాల సాయంతో కనిపెట్టిన చెన్నై యువకుడు ఎవరు ?

10. పిల్లల్లో డయేరియా నిర్మూలనకు తయారు చేసిన కొత్త వ్యాక్సిన్ రోటా వ్యాక్ 5డీని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిన భారత ఫార్మా కంపెనీ ఏదీ ?