Wednesday, August 5

02 SEPT CA QUIZ

ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ కాదు... మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

02 సెప్టెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. స్పెయిన్ లో జరిగిన సాంట్స్ ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలుచుకున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎవరు ?

2. సాగర మథనానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టే కొత్త ప్రాజెక్ట్ గురించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏదో గుర్తించండి

1)  సాగర గర్భంలో పరిశోధనలు, మైనింగ్ చేపట్టడానికి సముద్రయాన్ అనే ప్రాజెక్ట్ చేపడుతున్నారు

2) సముద్ర గర్భంలో 6 వేల  మీటర్ల లోతునకి ముగ్గురు శాస్త్రవేత్తలను పంపుతారు

3) రూ.6 వేల కోట్ల డీప్ ఓషన్ మిషన్ లో భాగంగా ముందుగా రూ.200 కోట్లు ఖర్చు చేస్తారు

4) చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ పరిశోధనలు చేపడుతోంది

3. దేశంలో త్వరలో రూపే క్రెడిట్ కార్డుల తీసుకొస్తున్నట్ట ప్రకటించిన సంస్థ/ బ్యాంక్ ఏది ?

4. ఆర్మీ వైస్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అన్బూ రిటైర్డ్ అవడంతో ఆ స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

5. బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ లో ఏయే జట్టు ఫైనల్ కు చేరుకున్నాయి.

6. ISSF ప్రపంచ కప్ షూటింగ్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకొని... ఒలింపిక్ బెర్త్ ఖాయం చేసుకున్న క్రీడాకారిణి ఎవరు

7. టీ 20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి తెలపండి

ఎ) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా శ్రీలంక క్రికెటర్ గా శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ వరల్డ్ రికార్డు ( 74 మ్యాచుల్లో 99 వికెట్లు ) నెలకొల్పాడు

బి) షాహిది ఆఫ్రిదీ (99 మ్యాచుల్లో 98) వికెట్లను మలింగ అధిగమించాడు

సి)  పల్లె కెలెలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు సాధించాడు

8. రోజువారీ జీవితంలో శారీరక శ్రమను, క్రీడలను భాగం చేసే దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ఫిట్ ఇండియా కార్యక్రమాలన్ని ఆగస్టు 29న ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు

9. కొత్త గవర్నర్లకి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి

1) తెలంగాణ

2) హిమాచల్ ప్రదేశ్

3) మహారాష్ట్ర

4) కేరళ

5) రాజస్థాన్

 

ఎ) ఆరిఫ్ మహ్మద్ ఖాన్

బి) బండారు దత్తాత్రేయ

సి) భగత్ సింగ్ కోషియారి

డి) తమిళిసై సౌందర రాజన్

ఇ) కల్ రాజ్ మిశ్రా

10. ప్రపంచంలో అత్యంత భద్రమైన నగరాల జాబితా గురించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది

1) మొదటి స్థానంలో నిలిచిన నగరం – లండన్

2) ఢిల్లీ నగరానికి 52వ స్థానం

3) చివరి మూడు స్థానాల్లో యాంగూన్ (మయన్మార్), కరాచీ (పాకిస్థాన్) ఢాకా (బంగ్లాదేశ్)

4) ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ  ఐదు ఖండాలకు చెందిన 60 నగరాల్లోని పరిస్థితులను మదింపు చేసి ఈ రిపోర్ట్ వెల్లడించింది.