Thursday, October 1

02 SEPT CA QUIZ

1. భారత్ – చైనా బోర్డర్ లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవులో పర్వ శ్రేణులను స్వాధీనం చేసుకోవడంలో భారత్ కు చెందిన అంత్యంత రహస్య విభాగం పర్వత యోధులు కీలకంగా వ్యవహరించారు.  వీళ్ళని ఏ పేరుతో పిలుస్తారు ?

2. విత్తనాల్లో జీవం ఎంతకాలం ఉంటుంది... వాటిని భద్రపరిస్తే ఎంత మేరకు మొలకెత్తుతాయి అనే కోణంలో జరుగుతున్న పరిశోధనల్లో ఇక్రిశాట్ కూడా పాల్గొంటోంది.  వివిధ రకాల పంటల విత్తనాలను ఆర్కిటిక్ ఖండంలో ఉన్న స్వాల్ బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ లో భద్రపరుస్తున్నారు.  ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది ?

3. ఆర్కిటిక్ ఖండంలో ఉన్న స్వాల్ బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ లో భద్ర పరిచేందుకు ఇక్రిశాట్ ఇచ్చిన ఏయే విత్తనాలను 2020 ఆగస్ట్ 28 నాడు భద్రపరిచారు ?

4. తన జీవిత చరిత్రను చిత్రీకరించారని సత్యం రామలింగరాజు పిటిషన్ తో ఏ OTTలో 2020 సెప్టెంబర్ 2 నుంచి ప్రసారం కావాల్సిన బ్యాడ్ బాయ్ బిలియనీర్ సిరీస్ ను హైదరాబాద్ కోర్టు నిలిపివేసింది ?

5. కరోనా కారణంగా వృద్ధి, ద్రవ్య పరిస్థితులు క్షీణించడంతో ఏ ఏడాది కల్లా అత్యధిక అప్పులున్న పెద్ద స్థాయి వర్ధమాన దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది ?

6. ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుదుత్పత్తి సంస్థగా భారత్ కు చెందిన ఏ సంస్థని మెర్కామ్ కేపిటల్ గుర్తించింది ?

7. వచ్చే 16 యేళ్ళల్లో భారత్ జనాభా 151.8 కోట్లకి చేరే అవకాశం ఉన్నట్టు జనాభా వృద్ధి రేటు అంచనాలు చెబుతున్నాయి. దేశంలో జనసాంద్రత 368 నుంచి ఎంతకు పెరగనుందని అంచనాలబట్టి తెలుస్తోంది ?

8. ప్రతిభావంతులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా స్పోర్ట్స్ కోటాలో మరికొన్ని ఆటలను కేంద్రం చేర్చింది.  టగ్ ఆఫ్ వార్, మల్లకంట్, బేస్ బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్, బదిర క్రీడలు, పారా క్రీడలు సహా 20 ఆటల్ని యాడ్ చేశారు.  గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగులుగా వీరు అర్హులు. అయితే కొత్త క్రీడల చేరికతో స్పోర్ట్స్ కోటాలో ఎన్నింటికీ స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది ?

9. అమెరికా మార్కెట్లో టెస్లా షేర్లు లాభపడటంతో 115.4 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు ?

10. దారుణమైన ఆహార సంక్షోభంలో ఉన్న ఏ దేశంలో క్లీన్ యువర్ ప్లేట్ కార్యక్రమాన్ని చేపట్టారు ? ( ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు పిలుపు ఇచ్చారు )