Thursday, October 1

01 SEPT CA QUIZ

1. భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) భారీగా క్షీణించింది.  కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చేపట్టిన లాక్ డౌన్ కారణంగా 2020 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో ఎంత శాతం డౌన్ అయింది ?

2. 2020 సెప్టెంబర్ 1 నాడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 64వ సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  1956 సెప్టెంబర్ 1నాడు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన LIC కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ?

3. ఇండోనేషియాలో శాంతి పరిరక్షక దళంలో మహిళలను భాగస్వాములు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి రూపొందించింది.  దీనికి సాయం అందిస్తున్న దేశం ఏది ?

4. ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గ్వే అడ్వంచర్ అవార్డ్ ను అందుకున్న భారత్ కు చెందిన మొదటి దివ్యాంగ స్పోర్ట్స్ మెన్ ఎవరు ?

5. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రెసిడెంట్ జర్నీని వివరిస్తూ రాసి చివరి బుక్ ఏది ?

6. సుప్రీం కోర్టు జడ్జీలను కించపరిచారన్న ఉద్దేశ్యంతో కంటెంప్ట్ ఆఫ్ కేసులో ఏ సీనియర్ అడ్వకేట్ కి సుప్రీంకోర్టు ఒక రూపాయి ఫైన్ విధించింది ?

7. ఏ దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి భారత్ 5 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది ?

8. ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రొవిడెంట్ సొసైటీలను కలిపి 1956 సెప్టెంబర్ 1 నాటికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు ?

9. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్ట్ 31 నాడు చనిపోయారు.  ఆయన 1969లో రాజ్యసభలోకి మొదటిసారిగా అడుగుపెట్టారు.  అయితే రాష్ట్రపతిగా ఏ ఏడాదిలో పదవీ బాధ్యతలు చేపట్టారు ?

10. ఇంటర్నేషనల్ ఉమెన్స్ ట్రేడ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?