స్టాండప్ ఇండియా

SC, STలు మహిళల్లో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2016 ఏప్రిల్ 5న దళిత నేత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా దీన్ని ప్రారంభించారు.  భాతర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ), దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (డిక్కీ) దేశంలో భిన్న రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. సిడ్బీతో పాటు నాబార్డ్ కూడా స్టాండప్ కనెక్ట్ సెంటర్లను నిర్వహిస్తుంది.  ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తేలికపాటి రుణాలు అందించడం, ఎస్సీ, ఎస్టీ, మహిళలు చేపట్టే వ్యవసాయేతర కార్యక్రమాల కింద 10లక్షల నుంచి కోటి రూపాయల దాకా కొద్దిపాటి షరతులతో రుణాలు అందించడం. దేశంలోని ప్రతీ ఒక్క బ్యాంకు యొక్క శాఖ ఎస్సీ, ఎస్టీ లేదా మహిళకు రుణం అందించేలా చూడటం. రుణాలు తీసుకునే పారిశ్రామిక వేత్తలకు రూపే కార్డును అందిస్తారు.  దీంతో ఒకేసారి రుణ మొత్తాన్ని తీసుకోకుండా వర్కింగ్ కేపిటల్ కింద అవసరమైనప్పుడల్లా సొమ్ము విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.