సింధూ నాగరికత కాలంలో శిల్పకళ

1) సింధూ నాగరికతలో శిల్పకళకు ఉదాహరణగా వేటిని చెప్పుకోవచ్చు ?
జ: హరప్పా శిధిలాల్లో దొరికిన మృణ్మయ పాత్రలు
2) ప్లాస్టిక్ కళలో సింధులోయ ప్రజలకు ప్రవేశం ఉందని చెప్పేందుకు ఉదాహరణ ఏది ?
జ: హరప్పా శిథిలాల్లో దొరికిన ఇసుక రాతి విగ్రహాలు
3) సింధూ నాగరికతకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాఖండాలుగా వేటిని చెబుతారు ?
జ: మొహంజాదారోలోని ధాన్యాగారాలు, స్నానవాటిక
4) విగ్రహారాధన అనేది భారతీయ కళల్లో మొదట ఏ సంస్కృతిలో కనిపిస్తుంది ?
జ: హరప్పా సంస్కృతి
5) సింధు నాగరికతలో అత్యుత్తమ లోహ నమూనా ఏది ?
జ: మొహెంజోదారోలో లభించిన, నగ్నంగా ఉన్న నాట్యగత్తె కాంస్య ప్రతిమ
6) అలాగే ఉత్తర రాతి నమూనా ఏది ?
జ: గడ్డంతో ఉన్న పురుషుడి స్టీటైట్ ప్రతిమ