విజయనగర కాలంలో చిత్రకళ

1) హంపి, అనెగొండి, తాడిపత్రి, లేపాక్షి, కాంచీపురం, కాళహస్తి, తిరుపతి... లాంటి పుణ్యక్షేత్రాల్లో కనిపించే చిత్రలేఖనాలు ఏ రాజుల కాలం నాటివి ?
జ: విజయనగర రాజులు
2) పల్లకీలో విద్యారణ్యస్వామిని ఊరేగిస్తున్నట్టుగా ఉండే చిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి ?
జ: హంపీలోని విరూపాక్ష ఆలయంలో
3) వటపత్రశాయి, సీతారాముల అరణ్యవాసం, కిరాతార్జునీయం చిత్రాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి ?
జ: లేపాక్షిలో
4) రావణ సంహార ఘటాలను ఎక్కడ చిత్రీకరించారు ?
జ: అనెగొంది లో
5) వీరభద్రుని చిత్రం, రామాయణ, మహాభారతాల చిత్రలేఖనాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి ?
జ: లేపాక్షిలోని విరూపాక్ష ఆలయంలో
6) కంచిలోని వరదరాజు ఆలయంలో కనిపించే దృశ్య కావ్యం ఏది ?
జ: మన్మధుడు
7) చెట్లు, కొండలు లాంటి ప్రకృతి దృశ్యాలను ఏ రాజులు ఉపయోగించలేదు ?
జ: విజయనగర రాజులు