యూరోపియన్ల రాక

1) భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టినది ఎవరు?
జ) వాస్కోడిగామా (1498 మే 17)
2) వాస్కోడిగామా ఎక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ప్రభువు ఎవరు ?
జ: భారత్ పశ్చిమతీరంలోని కాలికట్ కు. రాజు జామొరిన్
3) వాస్కోడిగామాకి సహాయపడిన అరబ్ వ్యాపారి ఎవరు ?
జ: అబ్దుల్ మజీద్
4) వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు?
జ) 1502 అక్టోబర్ 30.
5) వాస్కోడిగామా ఏ వ్యాధితో చనిపోయాడు ?
జం కోచిన్ లో మలేరియా వ్యాధితో
6) ప్రపంచాన్ని చుట్ట వచ్చిన మొదటి నావికుడు ఎవరు ?
జ: ఫ్రాన్సిస్ డ్రేక్
7) పోర్చుగీసు వారు ఎస్టోడ-డ-ఇండియా అనే కంపెనీ పేరుతో తూర్పు దేశాలతో వ్యాపారం మొదలుపెట్టారు. అయితే మొదటి వర్తక స్థావరం ఏది ?
జ: సూరత్
8) పోర్చుగీసువారి మొదటి, రెండో ప్రధాన స్థావరాలు ఏవి ?
జ: కొచిన్ మొదటిది, గోవా రెండోది
9) శ్రీకృష్ణ దేవరాయులుతో మైత్రి సంధి చేసుకున్న పోర్చుగీసు గవర్నర్ ఎవరు ?
జ: అల్బూకర్క్
10) పోర్చుగీసు మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి.అల్మిదా. ఇతని విధానాన్ని ఏమంటారు ?
జ: బ్లూ వాటర్ పాలసీ (నీలి నీటి విధానం)
11) భారత్ నుంచి చివరిగా వెళ్ళి పోయిన వారు ఎవరు ?
జ: పోర్చుగీసు వారు
12) సూరత్ స్థావరంగా డచ్ వారు వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అయితే డచ్ వారు తమ వ్యాపారాన్ని ఏ కంపెనీ పేరుతో మొదలు పెట్టారు ?
జ: డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ
13) డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది ?
జ: పులికాట్ ( ఆ తర్వాత నాగపట్నం)
14) ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు ?
జ: ఎలిజిబెత్ - 1
15) ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం ఏది ?
జ: సూరత్
16) ఆంగ్లేయుల వ్యాపారానికి అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?
జ: జహంగీర్
17) ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వ్యాపారానికి అనుమతి ఇచ్చిన గొల్కొండ సూల్తాన్ ఎవరు ?
జ: మహ్మద్ కులీకుతుబ్ షా (సువర్ణ ఫర్మానా జారీ చేశాడు)
18) ఆంగ్లేయులు మద్రాస్ లో నిర్మించిన కోట పేరేంటి ?
జ: సెయింట్ జార్జి కోట (ఫ్రానిస్ డే)
19) బ్రిటీష్ యువరాజు 2వ చార్లెస్ పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజను పెళ్ళి చేసుకున్నందుకు బహుమానంగా పోర్చుగీసువారు ఏ నగరాన్ని చార్లెస్ కు ఇచ్చారు ?
జ: బొంబాయి నగరం
20) కాళీఘాట్, సుతనతి, గోవిందాపూర్ గ్రామాలు మూడు కలిపి ఏ నగరంగా అభివృద్ధి చెందాయి
జ: కలకత్తా గా
21) కలకత్తాలో ఆంగ్లేయులు నిర్మించిన కోట పేరేంటి ?
జ: విలియం కోట (నిర్మించింది : జాబ్ చార్నాక్)
22) ఆంగ్లేయులు - హోదాలు - మొదటి వ్యక్తలు
జ: మొదటి బెంగాల్ గవర్నర్ - డ్రేక్
మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ - వారన్ హేస్టింగ్
భారత దేశపు మొదటి గవర్నర్ జనరల్ - విలియం బెంటింక్
మొదటి వైశ్రాయ్ - లార్డ్ కానింగ్
23) పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయులు కాకుండా భారత్ కు వచ్చిన మరో యూరోపియన్లు ఎవరు ?
జ: డేన్స్ ( డెన్మార్క్ )
24) ఫ్రెంచ్ తరపున తూర్పుదేశాలతో వ్యాపారానికి వచ్చిన వారెవరు ? ఆయన కంపెనీ పేరేంటి ?
జ: ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి కోల్ బర్ట్ ( కోల్ బర్ట్ సంఘం)
25) పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు ?
జ: ఫ్రాంకోయిజ్ మార్టిన్ ( భారత్ లో మొదటి ఫ్రెంచ్ గవర్నర్)
26) పాండిచ్చేరి (ప్రస్తుతం పుదుచ్చేరి) లో ఫ్రెంచ్ వారు నిర్మించిన కోట పేరేంటి ?
జ: లూయీ కోట