మొగలుల చిత్రకళలు

1) పర్షియా ప్రభావంతో కాగితంపై చిత్రలేఖనాన్ని ప్రవేశపెట్టిన రాజులు ఎవరు ?
జ: మొగలులు
2) భారతీయ, పర్షియన్ చిత్రకళల సమ్మిళితంగా దేన్ని చెప్పుకోవచ్చు ?
జ: సుల్లానుల చిత్రకళ
3) కాగితంపై చిత్రాలను గీయడాన్ని ఏమంటారు ?
జ: లఘు చిత్రకళ
4) మానవులు చిత్రపటాలను గీయడం ఎవరి ప్రత్యేకత ?
జ: మొగలు చిత్రకళాకారులు
5) మొగల్ చిత్రకళ ఏ రాజు కాలంలో ఉన్నత స్థితికి చేరింది ?
జ: జహంగీర్
6) రాజవంశీయులే కాదు మహనీయులు, మహాత్ములు, నాట్యకర్తలు, ప్రేమికులు లాంటి వారి చిత్రాలను కూడా ఎవరి కాలం నుంచి గీయించడం మొదలుపెట్టారు ?
జ: జహంగీర్
7) పర్షియాలోని ఆర్ట్ గ్యాలరీలను సందర్శించి చిత్రలేఖనం ఇష్టం పెంచుకున్న రాజు ఎవరు ?
జ: హుమాయూన్
8) చిత్రాలను గీయడానికి ప్రత్యేకంగా విదేశాల నుంచి కళాకారులను రప్పించిన రాజు ఎవరు ?
జ: జహంగీర్
9) హుమయూన్ కాలంలో భారత్ కు వచ్చిన ఖ్వాజా అబ్దుస్ సమద్, మీర్ సయ్యద్ అలీ ఏ దేశానికి చెందిన వారు ? వీళ్ళు సంకలనం చేసిన చిత్రలేఖన గ్రంథం ఏది ?
జ: పర్షియా - దస్తాన్ -ఇ - అమీరిహంజా
10) చిత్రలేఖకులు సృష్టికర్తతో సమానం- అన్నదెవరు ?
జ: అక్బర్