భారతీయ శాస్త్రీయ నృత్యాలు

1) శాస్త్రీయ, జానపద నృత్యాలు ఎవరి నాట్య శాస్త్ర సూత్రాలపై ఆధారపడి రూపొందించబడినవి ?
జ: భరతముని
2) భరత నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ?
జ: తమిళనాడు
3) దేశీయ నృత్యాల గురించి 11 వ శతాబ్దంలో వివరించిన వారెవరు ?
జ: సోమేశ్వరుడు, భోజుడు
4) కాకతీయుల కాలంలో నృత్యరత్నావళిలో మార్గ-దేశీ నృత్య సంప్రదాయాలను వివరించినది ఎవరు ?
జ: జాయప సేనాని
5) అభినయ దర్పణం, గీతా గోవిందం నాట్యగ్రంథాల రచయితలు ఎవరు ?
జ: అభియన దర్పణం - నందికేశ్వరుడు, గీతగోవిందం - జయదేవుడు
6) నాట్యానికి ఏ నాలుగు ఉపాంగాలు అవసరమని భరతుడు తెలిపాడు ?
జ: అంగిక, వాచక, ఆహార్య, సాత్వికములు