భారతదేశ రక్షణ రంగం – క్షిపణులు

1) సైనిక, వాయు, నౌకాదళాల మన దేశ మొదటి అత్యున్నత అధికారులు ఎవరు ?
జ: మొదటి సైనిక దళాల జనరల్ రాజేంద్ర సింగ్
మొదటి ఎయిర్ చీఫ్ మార్షల్ - SK ముఖర్జీ
మొదటి నేవీ అడ్మిరల్ ఆర్ డీ కఠారి
2) సైన్యంలో తొలి ఫీల్డ్ మార్షల్ గౌరవం పొందిన వ్యక్తి ఎవరు ?
జ: మానెక్ షా
3) తొలి మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ హోదా పొందిన వ్యక్తి ఎవరు ?
జ: అర్జున్ సింగ్
4) మన దేశపు మొదటి యుద్ద ట్యాంకు ఏది?
జ: వైజయంతి
5) మన దేశపు అత్యాధునిక ప్రధాన యుద్ద ట్యాంకు ఏది?
జ: అర్జున్
6) మనదేశపు ప్రధాన రాకెట్ లాంచర్ వ్యవస్ద కలిగిన యుద్ద ట్యాంకు ఏది?
జ: పినాక
7) భారత దేశపు పైలట్ రహిత, తేలికపాటి యుద్ద విమానం ఏది?
జ: తేజస్
8) భారతదేశపు తొలి హెలికాప్టర్ ఏది?
జ: హమ్స్
9) భారతదేశపు ఆయుధాలను కలిగిన హెలికాప్టర్ ఏది?
జ: రుద్ర
10) మనదేశంలో ప్రధాన యుద్ద విమానం ఏది?
జ: సుఖోయ్.
11) భారతదేవపు అతిపెద్ద సైనిక రవాణా విమానం ఏది?
జ: సూపర్ హెర్క్యులస్ C-130J
12) ఆర్మీ శిక్షణా సంస్దలు ఎక్కడ ఉన్నాయి?
జ: డెహ్రాడూన్, పుణె
13) వాయుదళ శిక్షణా సంస్దలు ఎక్కడ ఉన్నాయి?
జ: హైదరాబాద్, సికింద్రాబాద్, కర్నాటకలోని జలహళ్ళి, తమిళనాడులోని కోయంబత్తూరు, ఆగ్రా.
14) భారతదేశపు తొలి యుద్ద నౌక ఏది?
జ: సావిత్రి.
15) ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి వచ్చిన భారతదేశపు యుద్దనౌక ఏది?
జ: INS తరంగిణి
16) 50యేళ్ళు పూర్తి చేసుకొని తిరిగి మన సముద్రపు జలాల్లో ప్రవేశపెట్టనున్న ప్రధాన నౌక ఏది?
జ: INS విరాట్
17) అడ్మిరల్ గోర్షకోవ్ అని దేనిని పిలుస్తారు?
జ: INS విక్రమాదిత్య
18) మనదేశంలో వేగంగా దాడి చేయగల క్షిపణి యుద్ద నౌక ఏది ?
జ: INS ప్రహార్
19) మనదేశపు ప్రధాన గూఢచార యుద్ద నౌక ఏది?
జ: INS శివాలిక్
20) మొదటిసారి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న జలాంతర్గామి యుద్ద నౌక ఏది?
జ: INS చక్ర
21) భారతదేశపు మొదటి జలాంతర్గామి యుద్ద నౌక ఏది?
జఫ INS అరిహంత్
22) భారతదేశపు సాగర గర్భాన్ని అన్వేషించడం కోసం ప్రవేశపెట్టిన నౌక ఏది?
జ: INS సింధు సాధన
23) స్వదేశంలో రూపొందించుకున్న పెద్ద యుద్ద నౌక ఏది?
జ: INS కోల్ కతా. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు.