భారతదేశ ఆక్రమణ

1) బెంగాల్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?
జ) ముర్షీద్ కులీఖాన్.
2) మైసూర్ ను ఎవరు స్థాపించారు?
జ) యదురాయ విజయ
3) బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
జ) వారెన్ హేస్టింగ్స్.
4) టిప్పుసుల్తాన్ బిరుదు ఏమిటి?
జ) మైసూర్ పులి.
5) రెండో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
జ) లార్డ్ వెల్లసీ.
6) యూరప్ లోని సప్తవర్ష యుద్ధాలకు భారత్ లో ఏ యుద్ధానికి సంబంధం ఉంది ?
జ: 3వ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం
7) సిరాజ్ ఉద్దౌలా చీకటి గదిలో బంధించిన 150మందిని విడిపించిన వారు ఎవరు ?
జ: రాబర్ట్ క్లైవ్
8) బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది ?
జ: ప్లాసీ యుద్ధం
9) ఆధునిక మైసూరు రాజ్య స్థాపకుడని ఎవరి గురించి చెబుతారు ?
జ: చిలక కృష్ణ రాజ్ ఒడయార్ (4వ చామరాజ)
10) శ్రీరంగ పట్టణంలో స్వేచ్ఛకు గుర్తింపుగా ఎవరు వృక్షాన్ని నాటారు ? దీనికి ఏమని పేరు ?
జ: ట్రీ ఆఫ్ లిబర్టీ ( స్వేచ్ఛా వృక్షం)
11) సిక్కు మతాన్ని స్థాపించినది ఎవరు?
జ) గురునానక్.
12) స్వర్ణదేవాలయాన్ని నిర్మించినది ఎవరు?
జ) అర్జున్ దేవ్
13) సిక్కుల పవిత్ర గ్రంధము ఏది ?
జ) ఆదిగ్రంధ్, గురుగ్రంధ్ సాహెబ్.
14) లాహోర్లో ఆదునిక కర్మాగారాన్ని నిర్మించినది ఎవరు?,
జ) మహారాజా రంజిత్ సింగ్.
15) భారతదేశ చరిత్రను మార్చిన యుద్దం?
జ) 3వ పానిపట్టు యుద్దం.
16) అమృత్ సర్ లో స్వర్ణదేవాలయానికి భూమిని ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ) అక్బర్
17) నిజమైన చక్రవర్తి (సత్యా బాదుషా) అని తనకు తానే ప్రకటించుకున్న సిక్కుల గురవు ఎవరు ?
జ: హరగోవింద్
18) సిక్కు రాజ్య నిర్మాత ఎవరు ?
జ: మహారాజా రంజిత్ సింగ్
19) ముస్లిమ్స్ లో బహు భార్యత్వాన్ని నిషేధించిన మైసూర్ రాజు ఎవరు ?
జ: టిప్పు సూల్తాన్
20) భారతదేశ చరిత్రలో విశ్వాస ఘాతకుడైన రాజుగా మిగిలిన బెంగాల్ నవాబు ఎవరు ?
జ: మీర్ జాఫర్