Saturday, January 19

పర్సనల్ కేర్ తో కోచింగ్

ఫ్రెండ్స్...
తెలంగాణ ఎగ్జామ్స్ కి ఆదరణ అందిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు.  మనం దిల్ సుఖ్ నగర్ లో కోచింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ముందు చెప్పినట్టుగా లిమిటెడ్ సీట్స్ తో కోచింగ్ మొదలవుతుంది.  RRBకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలవగా... PC/SI/GROUP.IV ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మరో నెల రోజుల్లో నోటిఫికేషన్లు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.  పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి ఛైర్మన్ గా వివి శ్రీనివాస్ రావు గారిని కూడా నియమించింది.  అందువల్ల స్థానికత అంశంపై ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోగానే... PC/SI కి నోటిఫికేషన్ పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా... కొందరు వయో పరిమితి సడలింపు గురించి అడుగుతున్నారు. ఈసారి  PC/SI పోస్టులు భారీగా ఉన్నాయి.  ఆశావాహులు కూడా చాలా మందే ఉన్నారు. అందువల్ల వయో పరిమితి విషయంలో ప్రభుత్వం సడలింపు ఇస్తుందనే భావిస్తున్నాం.  అదే ఆశావాద దృక్పథంతో మీరు కూడా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి.  ప్రస్తుతం నడుస్తున్న/రాబోయే నోటిఫికేషన్ల దృష్ట్యా RRB/PC/SI పోస్టులకు మీరు కంబైన్డ్ గా ప్రిపేర్ అయితే బెటర్ అని అనుకుంటున్నా. అందుకే మనం కోచింగ్ సెంటర్ లో  ఈ మూడింటికీ    కంబైన్డ్ గా సిలబస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం.  అందుకోసం ఫ్యాకల్టీస్ తో మాట్లాడి టైమింగ్ సెట్ చేస్తాం... సిలబస్ వివరాలు, టైమింగ్స్ మీరు స్వయంగా తెలంగాణ ఎగ్జామ్స్ ఆఫీసుకు వచ్చి తెలుసుకోగలరు.  ఇక కోచింగ్ మాత్రం ఉగాది తర్వాత మొదలుపెడతాం. ఈ వారంలో కోచింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తవుతాయి.  పండగ తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తామో... మీకు వీకెండ్ లేదా సోమవారం తెలియజేస్తాం.

ముఖ్యంగా మనం మొదటి బ్యాచ్ ను రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఇద్దామనుకుంటున్నాం.  అందుకే ప్రతి ఒక్కరిపైనా personal care తీసుకుంటున్నాం.  ఏ వారం ... ఆ వారం విశ్లేషణ చేసి... పర్సనల్ గా మీరు ఎలా డెవలప్ కావాలో మీకు సలహాలు ఇస్తాం.  దాంతో  మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో... ఏ సబ్జెక్ట్ లో ప్లస్ లో ఉన్నారో... ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి... అన్నది తెలియజేస్తాం. మీ కోచింగ్ కి ఇది చాలా ముఖ్యమని భావిస్తున్నాను.   మీరు రాసిన మాక్ టెస్టులను బట్టి... వారానికొకసారి  face to face ఈ రివ్యూ ఉంటుంది.

ఇప్పటికే pc/si వాళ్ళకి మాక్ టెస్టులు ప్రారంభం అయ్యాయి.  వీటిల్లో చాలా ప్రశ్నలను ఇక ముందు అప్లికేషన్ మెథడ్ లో తయారు చేస్తాం. ఉగాది తర్వాత... మన వెబ్ సైట్స్ లో మార్పులు, చేర్పులు జరుగుతాయి.  దాంతో ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ప్రశ్నలు అడిగే విధానంలో మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఇవి కోచింగ్ తీసుకునేవారికి పూర్తిగా ఉచితం.  అలాగే మాక్ టెస్టులకు ఫీజులు కట్టి రాస్తున్న వారికి, రాయబోయే వారికి కూడా ... మాక్ టెస్టుల మార్పులు, చేర్పులు అందుబాటులోకి వస్తాయి.

వీటితో పాటు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో కూడా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.  ఇంకా మరింత సమాచారంతో... డైలీ టెస్టులు, కరెంట్ ఎఫైర్స్ తో  దాన్ని అప్ డేట్ చేయబోతున్నాం.  ఇక ఎప్పటి నుంచో మన మిత్రులు ఇంగ్లీష్ వెబ్ సైట్/app అడుగుతున్నారు.  దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. 10,15 రోజుల్లో మీకు అందుబాటులోకి వస్తాయి.  నోటిఫికేషన్ పడే లోపు ప్రింటెడ్ మెటీరియల్ అందుబాటులోకి తెస్తాం.  మన ప్యాటర్న్ కి తగ్గట్టుగా మెటీరియల్ ను తయారు చేయిస్తున్నాం.

మాక్ టెస్టులకు ఫీజులు కట్టేవారు ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. లేదా స్వయంగా హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఆఫీసుకు వచ్చి మనీ పే చేయొచ్చు.

ఇప్పటికే కోచింగ్ తీసుకున్నవారు, బయటి ఇనిస్టిట్యూట్స్ లో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అవుతున్నవారికి..... ప్రత్యేకంగా సిస్టమ్స్ ఏర్పాటు చేసి వారంలో ఒక రోజు ఆన్ లైన్ లో గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును.  దీంతో మీకు ఆన్ లైన్ టెస్టులు రాసే ప్రాక్టీస్ తో పాటు పేపర్ ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది.  ఈ గ్రాండ్ టెస్టులో ఏప్రిల్ నుంచి నడుస్తాయి.

నోట్: ప్రస్తుతం మాక్ టెస్టులు రాస్తున్న వారికి విజ్ఞప్తి.. కొత్త ఆఫీసులో ఇంటర్నెట్ సెట్ కాలేదు... గురువారం నుంచి మళ్ళీ టెస్టులు మొదలుపెడతాం... సహకరించగలరు.
కోచింగ్ లో జాయిన్ అవ్వాలనుకునేవారు... తప్పనిసరిగా సీట్ బుక్ చేసుకోగలరు.
ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఆఫీసులో ఉదయం. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సంప్రదించవచ్చు.

అడ్రస్: తెలంగాణ ఎగ్జామ్స్ స్టడీ సర్కిల్, విజయశ్రీ నిలయం, అన్నపూర్ణ కళ్యాణ మండపం లేన్, సాయి బాబా గుడి పక్క రోడ్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్
ఫోన్ నెం: 703 6813 703 (from: telanganaexams.com)