నక్సలైట్ ఉద్యమం – వ్యాప్తి, రైతాంగ, గిరిజన పోరాటాలు

1) నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది?
జ) 1967 పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లోని నక్సల్ బరి ప్రాంతం.
2) విప్లవ పోరాటం ద్వారా ఆర్దిక, సాంఘిక సమానత్వాన్ని సాధించాలని మొదటగా పిలుపు ఇచ్చిందెవరు ?
జ) కార్ల్ మార్క్స్.
3) బోల్ష్‌విక్‌ విప్లవాన్ని చేపట్టినవారెవరు?
జ) లెనిన్.
4) లెనిన్ ఏ సంస్దను ఏర్పాటు చేశారు?
జ) కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్.
5) కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థలో చేరిన భారతీయ సభ్యుడెవరు?
జ) MN రాయ్.
6) భారతదేశంలో కమ్యూనిస్టు భావాలు ఎవరు ఏ పత్రిక ద్వారా తెలియజేశారు?
జ) S.A.డాంగే... ది సోషలిస్టు పత్రిక ద్వారా
7) CPI మొదటి కార్యదర్శి ఎవరు?
జ) సత్య భక్త.
8) భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీపై ఎప్పుడు నిషేదం విధించారు?
జ) 1934.
9) ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఎవరి నాయకత్వంలో ఎప్పుడు ఏర్పడింది?
జ) 1936 పుచ్చలపల్లి సుందరయ్య.
10) కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎప్పడు ఎత్తివేశారు ?
జ) 1942 జులై 23
11) కమ్యూనిస్టులు విద్రోహదినంగా ఏ రోజును పిలుస్తారు ?
జ) సెప్టెంబర్ 17
12) భారతదేశంలో అత్యధిక మెజార్టీతో మొదటి పార్లమెంటుకు ఎన్నికైన కమ్యూనిస్టు నాయకుడెవరు?
జ) రావి నారాయణరెడ్డి.
13) జమీందారీ చట్టాన్ని ఎవరు తీసుకువచ్చారు?
జ) లార్డ్ కారన్ వాలీస్.
14) భూస్వాముల పెత్తనం ఎక్కడ అధికంగా కనిపించేది?
జ) బెంగాల్
15) ఎవరి నేతృత్వంలో జమీందార్ల భూములను ఆక్రమించుకోవాలనీ, లాక్కున్న భూములను తిరిగి పొందాలని ప్రతిజ్ఞ చేశారు?
జ) చారు మజుందర్
16) 1968లో CPM ప్లీనరీకి అద్యక్షుడు ఎవరు?
జ) బర్దాన్
17) నక్సల్ బరి ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?
జ) 1967
18) గుత్తికొండ బిలం సమావేశాన్ని ఎవరు ఎప్పుడు నిర్వహించారు?
జ) మజుందార్ 1969.
19) చారుమజుందార్ ను ఎప్పుడు అరెస్టు చేశారు ?
జ) 1972 జులై 16.
20) మావోయిస్ట్ పార్టీ CPI( ML) ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన వారెవరు?
జ) కిషన్ జీ
21) కిషన్ జీ ఎప్పుడు చనిపోయారు?
జ) 2011 నవంబర్ 24
22) CPI పై నిషేదం ఎప్పుడు ఎత్తివేశారు?
జ)1977లో
23) గొల్లపల్లి సభ ఎప్పడు జరిగింది?
జ) 1977 ఆగష్టు 27.
24) జగిత్యాల జైత్రయాత్ర్ర ఎప్పుడు జరిగింది?
జ)1978 సెప్టెంబర్ 7.
25) పైడిపల్లి మహాసభ ఎప్పుడు జరిగింది?
జ) 1978 అక్టోబర్ 1.
26) లక్సెట్టిపేటలో రైతు బహిరంగసభ ఎప్పుడు జరిగింది?
జ) 1978 అక్టొబర్ 19.
27) ఇంద్రవెల్లి మహాసభ ఎప్పుడు జరిగింది?
జ) 1981 ఏప్రిల్ 20.
28) ప్రభుత్వం 144వ సెక్షన్ ఎప్పుడు విధించింది?
జ) 1981 ఏప్రిల్ 19.
29) ఇంద్రవెల్లి స్మారక స్థూపాన్ని ఎవరు నిర్మించారు?
జ) టంగుటూరి అంజయ్య.
30) నక్సలైట్ ఉద్యమం ఉత్తర తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైంది ?
జ)1970.
31) కొమరం భీం ఏ నినాదాన్ని ఇచ్చాడు?
జ) జల్, జంగల్, జమీన్.
32) నక్సలైట్లు సారా వ్యతిరేక ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
జ) 1990.
32) సీతారామయ్యను పార్టీ నుంచి బహిష్కరించినది ఎప్పుడు?
జ) 1991.
33) పీపుల్స్ వార్ పై నిషేదం ఎప్పుడు విధించారు?
జ) 1992 మే 21.
33) గ్రేహౌండ్స్ నాయకుడైన్ KS వ్యాస్ ను నక్సలైట్లు ఎప్పుడు కాల్చి చంపారు?
జ) 1993 జనవరి 27.
34) నక్సలైట్లపై నిషేధం ఎత్తివేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ) యన్.టి.రామారావు (1994 డిసెంబర్ 12న)
35) కొమరం భీం ఎప్పుడు చనిపోయాడు?
జ) 1940 అక్టోబర్ 27.
36) కొమరం భీం 74వ వర్దంతిని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అధికారికంగా నిర్వహించింది?
జ) 2014 అక్టోబర్ 27.
37) తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్టునైనా ఉండనివ్వనని అన్నదెవరు ?
జ) సర్దార్ వల్లభాయ్ పటేల్
38) ఆంధ్రా సోషలిస్టు పార్టీ ఎవరి నాయకత్వంలో ఉర్పడింది?
జ) యన్.జి.రంగా.
39) తెలంగాణ ప్రజాసమితి ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
జ) భూపతి కృష్ణమూర్తి.
40) జై తెలంగాణ పార్టీని ఎవరు స్దాపించారు?
జ) పటోళ్ల ఇంద్రారెడ్డి.
41) తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను ఎవరు స్దాపించారు?
జ) గద్దర్.