తెలంగాణ – నేలలు

1) దుబ్బనేలలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
జ: మెదక్ జిల్లాలో.
2) తెలంగాణలో ఎర్రనేలల్ని ఏమని పిలుస్తారు?
జ: చల్క నేలలు లేదా దుబ్బ నేలలు.
3) పత్తి సాగుకి ఏ నేలలు అనుకూలమైనవి?
జ: నల్లరేగడి నేలలు.
4) నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం కలిగిన నేలలు ఏవి?
జ: ఎర్ర నేలలు
5) రాష్ట్రంలో ఎర్ర నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి ?
జ: 48 శాతం వరకూ
6) ఎర్ర నేలల్లో ఏ ఖనిజాలు తక్కువగా ఉంటాయి ?
జ: నైట్రోజన్, ఫాస్పరస్
7) లేటరైట్ నేలలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది ?
జ: మెదక్
8) దుబ్బ నేలలు ఎక్కువగా ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి ?
జ: హైదరాబాద్ శివార్లతో పాటు మెదక్ జిల్లాలో
9) ఎర్ర నేలలు తక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏది ?
జ: ఆదిలాబాద్
10) తెలంగాణలో ద్వితీయ స్థానం ఆక్రమించిన నల్లరేగడి నేలలు ఎంత శాతం ఉన్నాయి ?
జ: 25శాతం
11) ఒండ్రు నేలలు రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నాయి ?
జ: 20 శాతం
12) లేటరైట్ నేలలను మరో పేరుతో ఏమని పిలుస్తారు ?
జ: ఎర్ర రాతి నేలలు లేదా జేగురు నేలలు
13) నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం ఉన్న నేలలు ఏవి ?
జ: ఎర్ర నేలలు
14) పత్తి సాగుకు వీలైన నేలలు ఏవి ?
జ: నల్ల రేగడి నేలలు
15) రాష్ట్రంలో ఈ నేలలు అధికంగా ఉన్నాయి. కానీ ఇవి తక్కువ సారవంతమైనవి. అవి ఏవి ?
జ: ఎర్ర నేలలు