డబుల్ బెడ్‌రూమ్‌

1) రాష్ట్రప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది ?
జ: 2015 అక్టోబర్ 22న
2) డబుల్ బెడ్‌రూమ్‌ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ శంఖుస్థాపన
చేశారు ?
జ: నల్గొండ జిల్లా సూర్యాపేట, మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల్లో
3) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద 2015-16 లో ఎన్ని ఇళ్ళు నిర్మించనున్నారు?
జ: 60 వేల ఇళ్ళు
4) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద 2016-17 బడ్జెట్ లో ఎన్ని ఇళ్ళు
నిర్మించనున్నారు ?
జ: 2 లక్షలు
5) ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 400 ఇళ్ళు
6) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఎంత శాతం ఇళ్ళు
కేటాయిస్తారు ?
జ: 50శాతం
7) డబుల్ బెడ్‌రూమ్‌ పథకంలో మైనార్టీలు, ఇతరులకు ఎంత శాతం ఇళ్ళు
కేటాయిస్తారు ?
జ: మైనార్టీలు 7 శాతం, 43 శాతం ఇతర అణగారిన వర్గాలకు
8) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణానికి
ఎంత మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేయనుంది ?
జ: పట్టణాల్లో : రు.5.30 లక్షలు, గ్రామాల్లో : రూ.5.04 లక్షలు
9) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం లబ్దిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసే కమిటీకి
ఎవరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు ?
జ: జిల్లా మంత్రి ఛైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కమిటీకి కన్వీనర్
10) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద ఒక్కో ఇల్లును ఎన్ని చదరపు అడుగుల్లో నిర్మిస్తారు ?
జ: 560 చ.అడుగులు