జై ఆంధ్ర్ర ఉద్యమం – పర్యవసానాలు

1) 1969 తెలంగాణ ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినంది ఎవరు?
జ) కాసు బ్రహ్మానందరెడ్డి.
2) 1972 ఫిబ్రవరి 14న ఎవరి అధ్యక్షతన హైకోర్టు బెంచి ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు ఇచ్చింది ?
జ: కొండా మాధవ రెడ్డి
3) ముల్కీ రూల్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఎవరు సవాల్ చేశారు ? వాదించిన వారెవరు ?
జ: పి.వి. నర్సింహారావు, వాదించింది: కె.నర్సింగరావు
3) భూగరిష్ట పరిమిత బిల్లు శాసనసభ ఆమోదం ఎప్పుడు పొందింది?
జ) 1972 సెప్టెంబర్ 15 (పీవి హయాంలో)
3) జై ఆంద్ర ఉద్యమానికి మొదటగా నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు?
జ) కాకాని వెంకటరత్నం.
4) 1972 అక్టోబర్ 18న విజయవాడలో ఆంధ్రనాయకులు ఎవరి అధ్యక్షతన ప్రజా పరిషత్ సంస్థను ఏర్పాటు చేశారు ?
జ: సర్దార్ గౌతు లచ్చన్న
5) ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజాపరిషత్ సంస్థ ఎప్పుడు ఆంధ్ర బంద్ నిర్వహించింది ?
జ: 1972 అక్టోబర్ 21
6) ఆంధ్రసేన సంఘానికి అధ్యక్షుడు ఎవరు?
జ) మాదాల జానకీరాం.
7) ఆంధ్ర ఉద్యోగులు ఎప్పుడు నిరవధిక సమ్మె చేశారు ?
జం 1972 డిసెంబర్ 7 నుంచి 1973 మార్చి 25 వరకూ (108 రోజుల పాటు)
8) విజయవాడలో పోలీసు కాల్పులు ఎప్పుడు జరిగాయి ? ఎంతమంది మరణించారు ?
జ: 1972 డిసెంబర్ 25న 8 మంది
9) పోలీస్ కాల్పుల్లో గాయపడ్డవారిని పరామర్శించి వచ్చి గుండెపోటుతో చనిపోయిన వారెవరు ?
జ: కాకాని వెంకట రత్నం
10) పి.వి.నరసింహారావు తన పదవికి రాజీనామా ఎప్పుడు చేశారు?
జ) 1973 జనవరి 17
11) ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర్రపతి పాలన ఎప్పుడు విధించారు?
జ) 1973 జనవరి 18 (అప్పగి గవర్నర్: ఖాండూ బాయ్ దేశాయ్ )
12) ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గవర్నర్ ఖాండూ బాయ్ దేశాయ్ కి సలహాదారులుగా వ్యవహరించిందెవరు ?
జ: HC శరీన్, వీకే రావు
13) జై ఆంధ్ర ఫ్రంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ) 1973 ఏప్రియల్ 6
14) ఆంధ్ర ఉద్యోగ నాయకులైన ఎవరిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు?
జ) ఎ.శ్రీరాములు, రామకృష్ణారావు.
15) ఇందిరాగాంధీ ఆరు సూత్రాల ప్రతిపాదన ఎప్పడు చేశారు?
జ) 1973 సెప్టెంబర్ 21.
16) ఆరు సూత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించినవారెవరు?
జ) మర్రి చెన్నారెడ్డి.
17) హైదరాబాద్ ఫ్రీ జోన్ కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది?
జ) 2009 అక్టోబర్ 9.
18) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఎప్పుడు ఏర్పడింది?
జ) 1976.
19) జయభారతరెడ్డి కమిటీ నివేదికను పరిశీలించడానికి నియమించిన మరో కమిటీ ఏది?
జ) సుందరేశన్ (ఐఎయస్).
20) 23 జిల్లా కలెక్టర్లలో తెలంగాణవారు ఎంతమంది ఉండే వారు ?
జ) ఒక్కరు మాత్రమే.
21) జిఓ. 610 ఎప్పుడు విడుదలైంది. ?
జ) 1985 డిసెంబర్ 30
22) చంద్రబాబునాయుడు ప్రభుత్వం J M గిర్ గ్లానీ కమీషన్ ను ఎప్పుడు నియమించింది?
జ) 2001 జూన్ 25
23) తెలంగాణలో 1952 సెప్టెంబర్లో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం ఏది?
జ) గైర్ ముల్కీ ఉద్యమం.
24) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో ఉన్న మొత్తం 23 జిల్లాలను ఎన్ని జోన్లుగా కేటాయించారు?
జ) 6 జోనులు.