జైన సంస్కృతి

1) జైన మతాన్ని స్థాపించింది ఎవరు ? ఈ మతానికి మూలపురుషులు ఎవరు ?
జ: రిషభనాధుడు - తీర్థంకరులు
2) జైనమత సంస్కృతిలో ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు ?
జ: 24 మంది
3) పురోహితుల ఆధిక్యతను, వేదాలను ఖండించి... కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఉంచినదెవరు ?
జ: వర్ధమాన మహావీరుడు
4) మోక్ష మార్గానికి జైన మతం చెప్పిన త్రిరత్నాలు ఏవి ?
జ: 1) సరియైన విశ్వాపం 2) సరియైన జ్ఞానం 3) సరియైన నడవడిక
5) శరీరాన్ని కృశింపజేసి చనిపోవాలన్న జైనుల ఆదర్శాన్ని ఏమంటారు ?
జ: సల్లేఖన వ్రతం
6) వేదాల ప్రామాణికత, కర్మకాండలను జైన మతం తిరస్కరించినా ఏ సిద్ధాంతాన్ని అంగీకరించింది ?
జ: ఆత్మ పునరావృతి
7) వర్ధమాన మహావీరుడిని జినుడు అంటారు. ఆయన పేరుమీదుగా ఆయ శిష్యులను జినులు (జైనులు) అంటారు. అయితే జినుడు అంటే అర్థం ఏంటి ?
జ: విజేత
8) జైనమతంలో ఉన్న రెండు శాఖలు ఏవి ?
జ: దిగంబరులు, శ్వేతాంబరులు
9) బంధాలను తెంచుకున్నారు కాబట్టి జైనులను ఏమంటారు ?
జ: నిర్గంధులు
10) దిగంబర శాఖకు భద్రబాహుడు నాయకత్వం వహించాడు. అయితే ఈ శాఖలో ఎవరికి మాత్రమే అనుమతి ఉండేది ?
జ: పురుషులకు
11) శ్వేతాంబర శాఖకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు. ఎవరికి ప్రవేశం ఉండేది ?
జ: స్థూల భద్రుడు - స్త్రీ పురుషులు ఇద్దరికీ
12) జైన దేవాలయాల్లో ప్రసిద్ధమైనవి ఏవి ?
జ: రాజప్థాన్ లోని దిల్వారా దేవాలయాలు
13) జైన మతస్థుల గోమఠేశ్వరుని విగ్రహం ఎక్కడ ఉంది ?
జ: శ్రావణ బెళగొళ
14) జైనులు మత గ్రంథాల్లో ఏ భాషలను వాడేవారు ?
జ: అర్థమాగధి, ప్రాకృతం, సంస్కృత భాషలు
15) చార్వక మతమును ఎవరు స్థాపించారు ?
జ: లోకాయత