గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు

1) కోల్ గ్రామాలను విదేశీ రైతులకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలో జరిగిన ఉద్యమం ఏది ?
జ: ఛోటా నాగపూర్
2) వడ్డీ వ్యాపారుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని చివరకు తిరుగుబాటు చేసిన వారు ఎవరు ?
జ: సంతాల్ లు ( రాజ్ మహల్ కొండల్లో ఉండేవారు )
3) ఉత్తరప్రదేశ్ కిసాన్ సభను ఎప్పుడు స్దాపించారు?
జ) 1918.
4) ఆల్ ఇండియా కిసాన్ సభను ఎవరు స్దాపించారు?
జ) స్వామి సహజానంద, ఎన్.జి.రంగా.
5) బార్దోలి ఉద్యమంలో పాల్గొన్నందుకు వల్లభాయ్ పటేల్ కు ఇచ్చిన బిరుదు ఏమిటి?
జ) సర్దార్
6) నీలిమందు తిరుగుబాటు ఎక్కడ జరిగింది ? ఎవరు నాయకత్వం వహించారు ?
జ: గోవింద్ పూర్ , దిగంబర్ బిశ్వాస్, బిష్ణు బిశ్వా్స్
7) నీలిమందు కార్మికుల దీనస్థితిని తెలియజేస్తూ వచ్చిన నాటిక ఏది ?
జ: నీల్ దర్పణ్ ( రచయిత: దీనబంధు మిత్ర)
8) బెంగాల్ లో యూరప్ తోట యజమానులు స్థానిక రైతుల భూభాగంలో 3/20 వంతు భాగంలో ఇండిగోను పండించాలని కుదుర్చుకున్న ఒప్పందం ఏది ?
జ: తీన్‌క‌తియా పద్దతి
9) నీలిమందు రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఉద్యమం ఏది ?
జ: చంపారన్ సత్యాగ్రహం ( గాంధీ నాయకత్వంలో)
10) ఖేరా సత్యాగ్రహంలో ముఖ్యపాత్ర పోషించింది ఎవరు ?
జ: వల్లభాయ్ పటేల్, మహదేవ దేశాయ్
11) అహ్మదాబాద్ లో టెక్స్‌టైల్‌ కార్మిక సంఘాన్ని ఎవరు స్థాపించారు ?
జ: మహాత్మాగాంధీ
12) భారతదేశంలో మొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్ ఏది ?
జ: మద్రాస్ లేబర్ యూనియన్ ( 1918లో దీన్ని బి.పి.వాచా స్థాపించారు)