ఎన్నికల కమిషన్ ఏర్పాటు

1) భారత్ లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ?
జ: 2014 నాటికి 81.45 కోట్ల మంది
2) ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది ?
జ: రాజ్యాగంలోని XV వ భాగంలో 324అధికరణ ప్రకారం
3) ఎన్నికల సంఘం తన పని విధానానికి సంబంధించి ఎవరికి జవాబుదారీ తనంగా ఉంటుంది ? యేటా ఎవరికి నివేదిక సమర్పిస్తుంది ?
జ: ఎవరికీ జవాబుదారీ కాదు. ఎవరికీ నివేదిక సమర్పించదు
4) భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ?
జ: 1950 జనవరి 25
(నోట్: అందుకే ఈ రోజులు ఓటర్ల దినోత్సవంగా జరుపుతారు )
5) ప్రారంభంలో సిఈసి ఏకసభ్య కమీషన్ గా పనిచేసేది. దీన్ని ఎవరి హయాంలో త్రిసభ్య కమిషన్ గా మార్చారు ?
జ: 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం
6) తర్వాత మళ్ళీ 1990లో తిరిగి ఏకసభ్య కమీషన్ గా ఎవరి హయాంలో మారింది ?
జ: వి.పి.సింగ్ ప్రభుత్వం
7) 1993లో పి.వి నర్సింహారావు ప్రభుత్వం తిరిగి ఎంతమంది సభ్యుల కమిషన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: త్రిసభ్య కమీషన్
8) ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య కమీషన్ గా మార్చుటను వ్యతిరేకిస్తూ ఎవరు వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ?
జ: అప్పటి CEC టి.యన్.శేషన్
9) త్రిసభ్య కమిషన్ ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది ?
జ: 1985 లో
10) సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం, కమీషన్ గా వ్యవహరించేటపుడు ఎవరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపింది ?
జ: ముగ్గురు సభ్యుల్లో ప్రధానాధికారి ఛైర్మన్ గా
11) ఎన్నికల కమీషన్ లో అభిప్రాయ భేదాలొచ్చినప్పుడు ఎవరి నిర్ణయం చెల్లుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?
జ: ముగ్గురు సభ్యుల్లో మెజార్టీ నిర్ణయం
12) CEC పదవీకాలం ఎంత ?
జ: 6యేళ్లు లేదా 65 సం.ల వయస్సు వచ్చే వరకూ
(నోట్: పదవీకాలం ముగియకముందే రాష్ట్ర్రపతి వారిని తొలగించవచ్చు)
13) అసమర్ధత,దుష్ప్ర్రవర్తన కారణాలపై ఎన్నికల కమిషనర్లను పదవి నుంచి తొలగించినపుడు పార్లమెంటులో ఎంత మెజారిటీ ఉండాలి ?
జ: 2/3 వంతు (ప్రత్యేక తీర్మానం ద్వారా)
14) ఎవరి సూచనల ప్రకారం ఇద్దరు అధికారులు, రాష్ట్ర్రాల్లోని అధికారులను తొలగిస్తారు ?
జ: CEC ( ప్రధాన ఎన్నికల అధికారి )
15) ఎన్నికల అధికారులుగా నియమించేటప్పుడు ప్రధానంగా ఎవరిని నియమిస్తున్నారు ?
జ: లా కమీషన్లో చేసిన వారు లేక సీనియర్ IAS లు
16) భారత మొదటి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు ?
జ: మొదటి CEC సుకుమార్ సేన్
17) ఎక్కువకాలం CECగా పనిచేసినవారు ఎవరు ?
జ: కె.వి.కె.సుందరం
18) అతి తక్కువ కాలం CEC గా పనిచేసినవారు ఎవరు ?
జ: డా.నాగేంద్ర సింగ్
19) తాత్కాలిక CEC గా చేసిన ఏకైక మహిళ ఎవరు ?
జ: వి.యన్.రమాదేవి
20) భారత్ లో ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టినవారు ఎవరు ?
జ: టి.యన్.శేషన్
21) ఓటర్ ఐడెంటిటీ కార్డులను ప్రవేశపెట్టిన CEC ఎవరు ?
జ: టి.యన్.శేషన్.
22) రామన్ మెగాసెసె అవార్డు పొందిన CEC లు ఎవరు ?
జ: T.N శేషన్, J.M.లింగ్డో
23) 2016 లో భారత్ లో పార్లమెంటు, శాసనసభ నియోజక వర్గాల పునర్ వ్యవస్ధీకరణకు సంబంధించి డీ లిమిటేషన్ కమిటీలో సభ్యులుగా చేసినవారు ఎవరు ?
జ: బి.బి.టాండన్
24) సాధారణ ఎన్నికల్లో నెగెటివ్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టుటకు అనుమతించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసిన అధికారి ఎవరు ?
జ: టి.యన్.కృష్ణమూర్తి.