Monday, December 17

ఆయూష్ కోర్సులకు నీట్ తప్పని సరి

2019- 20 విద్యా సంవత్సరం నుంచి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను నీట్-యూజీ స్కోర్ ఆధారంగానే చేపట్టనున్నట్లు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. ఆయూష్ కోర్సులకు నీట్ తప్పని సరి అని కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది నుంచి నీట్‌తోనే ఆయుష్ సీట్ల భర్తీ అనే నిబంధన తప్పనిసరి చేసింది. దీనిపై ఇప్పటి వరకూ వస్తున్న అపోహలు తొలగించేందుకు కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ నీట్ తప్పని సరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో కాళోజి హెల్త్ యూనివర్సిటీ BHMS, BUMS, BAMS, BNYS కోర్సుల సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in లో చూడ వచ్చని రిజిస్ట్రార్ తెలిపారు.